లక్కీ ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి.. బంగార్రాజులో అవకాశం

Webdunia
సోమవారం, 19 జులై 2021 (17:50 IST)
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున - దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబోలో తెరక్కనున్న చిత్రం 'బంగార్రాజు'. ఈ పాటికే నాగార్జున ఈ సినిమా పూర్తిచేయవలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు వాయిదా పడుతూ వచ్చింది. 
 
వచ్చే నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు.
 
మరోవైపు, నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండనుంది. ఈ పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆమె ఎంపిక ఖరారైపోయిందని తాజాగా అంటున్నారు. 
 
గ్రామీణ వాతావరణంలోనే ఈ కథ నడవనుంది. 'సంక్రాంతి' బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశంతో నాగ్ ఉన్నాడని అంటున్నారు. నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా విజయాన్ని సాధించి విషయం తెల్సిందే. నాగార్జున ద్విపాత్రాభినయం చేయగా, ఇందులో రమ్యకృష్ణతో పాటు లావణ్య త్రిపాఠి నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రంప్‌కు వర్జీనియా ప్రజలు వాత, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా మన మలక్ పేట మహిళ

ట్రంప్‌ను ఛీకొట్టిన న్యూయార్క్ ప్రజలు: పనిచేసిన ఉచిత బస్సు పథకం, మేయర్‌గా భారత సంతతి వ్యక్తి జోహ్రాన్

భార్యాభర్తల గొడవ- ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వదిలేసిన తండ్రి.. తర్వాత ఏం జరిగింది?

హైదరాబాద్-విజయవాడ హైవే.. నాలుగు నుంచి ఆరు లేన్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

నేను నమ్మని దాన్ని ప్రజలకు చెప్పలేను, అలా రూ 150 కోట్లు వదిలేసిన పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments