Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో తొలి నంది అవార్డు అందుకున్న రెబెల్ స్టార్

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (14:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో తొలి నంది అవార్డును అందుకున్న నటుడుగా రెబెల్ స్టార్ కృష్ణంరాజు రికార్డు సాధించారు. ఆయన 56 యేళ్ళ సుధీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రత్యేకతలను ఆయన సొంతం చేసుకున్నారు. 1966లో "చిలకా గోరింక" అనే చిత్రం ద్వారా వెండితెర హీరోగా పరిచయమైన కృష్ణంరాజు ఆదివారం వేకువజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. 
 
పోస్ట్ కోవిడ్‌తో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఆదివారం వేకువజామున కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఓక వైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు విలన్ క్యారెక్టర్లను కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. 
 
దాదాపు 200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తన 56 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఆయన ఎన్నో ప్రత్యేకతలను, ఘనతలను సొంతం చేసుకున్నారు. తెలుగులో మొట్టమొదటి నంది అవార్డును అందుకున్న ఘనత కూడా ఆయనదే. మరోవైపు ఆయన మృతి వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురవుతోంది.
 
మరోవైపు, కృష్ణంరాజు మృతిపట్ల సినీ, రాజకీయ రంగ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. కృష్ణంరాజు మృతి పట్ల టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రెబల్ స్టార్‌గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని.. ఆయన మరణం టాలీవుడ్‌కు తీరని లోటన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుతున్నానని చెప్పారు. 
 
అలాగే, కృష్ణంరాజు మృతి పట్ల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే కృష్ణంరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఒక మంచి స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయానని అన్నారు. కృష్ణంరాజుతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

ఎల్లో మీడియా రాళ్లేస్తోంది.. 48 గంటలే టైమ్... జగన్ లుక్‌పై నెట్టింట చర్చ? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments