Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 28న కృష్ణ వ్రిందా విహారి టీజర్

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (18:32 IST)
Naga Shourya, Shirley Setia
హీరో నాగ శౌర్య న‌టిస్తున్న తాజా సినిమా కృష్ణ వ్రిందా విహారి. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోంది.  నాగ‌శౌర్య తొలిసారి బ్రాహ్మణ యువ‌కుడిగా న‌టిస్తున్నాడు.
 
ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చిత్ర యూనిట్‌ టీజర్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. కృష్ణ  వ్రిందా విహారి టీజర్‌ను మార్చి 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్‌లో నాగ శౌర్య, షిర్లీ సెటియా రొమాంటిక్ పోజ్‌లో కనిపిస్తున్నారు.
 
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అలనాటి నటి రాధిక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
కృష్ణ  వ్రిందా విహారి వేసవి కానుక‌గా ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

క్లాస్‌ రూంలో ప్రొఫెసర్ డ్యాన్స్ - చప్పట్లు - ఈలలతో ఎంకరేజ్ చేసిన విద్యార్థులు!!

యూపీలో దారుణం: నలుగురు పిల్లల్ని గొంతుకోసి చంపేశాడు.. ఆపై ఉరేసుకున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments