Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ వ్రింద విహారి నుంచి పాట వర్షంలో వెన్నెలకు 30 లక్షల వ్యూస్

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:14 IST)
Nagashourya, Shirley Setia
నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి' మ్యూజికల్ జర్నీ గ్రాండ్ గా మొదలైయింది. ఈ చిత్రంలోని మొదటి పాట 'వర్షంలో వెన్నెల'ని సౌత్ క్వీన్ సమంత విడుదల చేశారు. ఈ పాట ఇప్పటివరకూ 30 లక్షల వ్యూస్‌తో రికార్డ్ సృష్టిస్తోంది.

 
మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. పాటని కూల్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.

 
హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు పాటలో విజువల్స్ చాలా లావిష్ గా వున్నాయి. శ్రీమణి అందించిన సాహిత్యం కూడా వర్షంలో వెన్నెలంతా హాయిగా వుంది. పాటలో వినిపించిన వీణ స్కోర్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట పాడిన సంజన కల్మంజే, ఆదిత్య ఆర్కే ఇద్దరూ తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటతో ‘కృష్ణ వ్రింద విహారి' సంగీత ప్రయాణం గ్రాండ్‌గా ప్రారంభమైయింది.  

 
Koo App

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments