ఎన్టీఆర్ బయోపిక్‌కు దర్శకత్వమా.. వెన్నులో వణుకుపుట్టింది : క్రిష్

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్రను దృశ్యకావ్యంగా మలిచే బాధ్యతలను తనను స్వీకరించమని కోరినపుడు తన వెన్నులో వణుకుపుట్టిందనీ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చెప్పారు.

Webdunia
సోమవారం, 28 మే 2018 (10:51 IST)
స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్రను దృశ్యకావ్యంగా మలిచే బాధ్యతలను తనను స్వీకరించమని కోరినపుడు తన వెన్నులో వణుకుపుట్టిందనీ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చెప్పారు.
 
ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్టు నుంచి దర్శకుడు తేజ తప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టుకు ఎవరు దర్శకత్వం వహిస్తారా అనే సందేహం నెలకొంది. దీనికి తెరదించుతూ ఆ చిత్ర నిర్మాత, హీరో బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను దృశ్యకావ్యం రూపంలో తెలుగుజాతికి అందించే అవకాశాన్ని క్రిష్‌కు అప్పగించారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించిన క్రిష్, మీడియాతో మాట్లాతూ, 'ఎన్టీఆర్' బయోపిక్‌కు దర్శకత్వం చేయాలని బాలయ్య అడిగినప్పుడు భయపడ్డానని, ఆ తరువాత, ఇది తనకు దక్కిన మహాభాగ్యంగా అనిపించిందన్నారు. 
 
ఎన్టీఆర్ జీవిత చరిత్రను దృశ్యకావ్యం రూపంలో తెలుగుజాతికి అందించే అవకాశాన్ని తనకు కల్పించిన బాలకృష్ణకు కృతజ్ఞతలని అన్నారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తని, తనపై ఉంచిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. పైగా, చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు, ఆయన జీవిత చరిత్రను సినిమాగా తీసే అవకాశం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదని దర్శకుడు క్రిష్ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments