Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త బంగారు లోకం ''శ్వేతబసు''కు పెళ్లైపోయింది.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (11:05 IST)
టాలీవుడ్‌లో కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయమైన అందాల బొమ్మ శ్వేతాబసు ప్రసాద్ పెళ్లికూతురైంది. శ్వేతబసు ప్రసాద్ వివాహం పూణేలో ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతబసు ప్రసాద్ వివాహం అట్టహాసంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. 
 
బెంగాలీ సంప్రదాయం ప్రకారం శ్వేతబసు ప్రసాద్ వివాహం జరిగింది. ఈ పెళ్లి వేడుకలో గులాబీ రంగు దుస్తులతో శ్వేతబసు ప్రసాద్ మెరిసిపోయింది. ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలను శ్వేతాబసు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా.. ఇక అయిపోయింది.. అంటూ తన పెళ్లి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 
 
కాగా మక్డీ సినిమా ద్వారా బాలనటిగా సినీ రంగంలోకి వచ్చిన శ్వేత.. ఈ సినిమా కోసం జాతీయ అవార్డును అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ వంటి సినిమాల్లో మెరిసింది. అయితే ఆమెకు ఆశించిన స్థాయిలో హీరోయిన్ ఛాన్సులు రాలేదు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతబసు ప్రసాద్ పలు సీరియల్స్‌లో నటించింది. బుల్లితెరకే పరిమితమై మంచి పేరు కొట్టేసిన శ్వేతబసు.. ఇక ప్రేమికుడినే పెళ్లాడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments