Komati reddy: సినెటేరియా ఫిలిం ఫెస్టివల్ వెబ్ సైట్ ప్రారంభించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

దేవీ
శనివారం, 13 సెప్టెంబరు 2025 (17:37 IST)
Komati Reddy launches Cineteria International Film Festival 2025 website
సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025 వెబ్ సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినెమాటోగ్రఫీ మరియు రోడ్లు భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాదు నగరంలో జరగనున్న ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. రానున్న డిసెంబర్ 20, 2025న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు సినెటేరియా ఫౌండేషన్ పేర్కొంది. 
 
ప్రముఖ స్వచ్చంద సంస్థ సినెటేరియా ఫౌండేషన్ సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2025 ను డిసెంబర్ 20, 2025 నుంచి డిసెంబర్ 28, 2025 వరకు హైదరాబాదులో నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే సినిమాలను హైదరాబాదు నగరంలోని 9 సినిమా మాల్స్ లలో, 9 రోజులపాటు నిర్వహించనున్నామని సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం డైరెక్టర్ వెంకటేశ్వర్లు బులెమోని తెలియజేశారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ నృత్యోత్సవం, ఫిలిం ఎక్జిబిషన్, ఫిల్మిన్వెస్ట్ 2025 సమ్మిట్, సినిమా టెక్నాలజీ మరియు వ్యాపారంపై మాస్టర్ క్లాసెస్, కంటెంట్ బి2బి మీట్స్ తదితరాలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
 
ఈ సినెటేరియా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో పోటీకి చలన చిత్రాలు, షార్ట్ ఫిలింస్, మ్యూజిక్ ఆల్బంస్, డాక్యుమెంటరీ ఫిలింస్ ఆహ్వానిస్తున్నామనీ, 2024 మరియు 2025 సంవత్సరాలలో నిర్మించిన చిత్రాలను పోటీకి పంపించవచ్చునని తెలిపారు. చలన చిత్రాలు పంపించడానికి చివరి తేదీ ఈ అక్టోబర్ 15, 2025. మరిన్ని వివరాలకోసం http://cinetaria.com/index.html  వెబ్ సైట్ లో చూడవచ్చుననీ, లేదా ఫోన్ నంబర్ 87122 17555 ద్వారా  సంప్రదించవచ్చునని తెలిపారు!!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో మరోమారు పేలిన తుపాకీ... ముగ్గురి మృతి

నా గుండె పగిలిపోయింది.. వర్ణించలేని బాధతో కుమిలిపోతున్నాను : హీరో విజయ్

కరూర్ తొక్కిసలాట ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు ... సీఎం స్టాలిన్ హెచ్చరిక

TVK Vijay: కరూర్ తొక్కిసలాట దురదృష్టకరమన్న పవన్ కల్యాణ్- భరించలేకపోతున్నాన్న విజయ్

TVK Vijay: పుష్ప-2 తొక్కిసలాట.. అల్లు అర్జున్ తరహాలో టీవీకే అధినేత విజయ్ అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments