M Venkaiah Naidu is launching the title of Khudiram Bose biopic
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీ నటులుగా ప్రతిభావంతుడైన విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి నిర్మిస్తున్న స్వాతంత్ర సమర యోధుడు బయోపిక్ చిత్రం "ఖుదీరామ్ బోస్". తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేసారు.ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..
Khudiram Bose biopic
భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఖుదీరామ్ బోస్,తను 1889లో జన్మించాడు. అయితే ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో బ్రిటీష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్ష విధించబడ్డాడు.ఈ కేసు విషయంలో జరిగిన కుట్ర విషయం.చరిత్రను అనుసరించే విద్యార్థులకు బాగా తెలుసు. ఇందులో రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటను కనబరచారు. సంగీత దర్శకుడు మణిశర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య ఇలా ఈ చిత్రానికి పని చేసిన వారందరూ ఈ సినిమాకు చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నాము అని అన్నారు.