Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాస్ షేక్ చేస్తాడో లేదో కానీ శాతకర్ణి మాత్రం వణికించేస్తున్నాడు...

వచ్చాడు! వచ్చాడు.. సైడ్‌ ఇవ్వండి బాసు అంటున్నారు చిరంజీవి. చిరంజీవి 150వ సినిమా విడుదలకు ఇంకా ఏడు రోజులే వుంది. ఏడవ తేదీన ప్రి-రిలీజ్‌ ఫంక్షన్‌.. గుంటూరు జిల్లాలో జరగబోతోంది. అందుకే ప్రమోషన్‌ను షురూ చేశారు. వేలాదిగా అభిమానుల్ని తరలించేందుకు ప్రణాళిక

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (17:12 IST)
వచ్చాడు! వచ్చాడు.. సైడ్‌ ఇవ్వండి బాసు అంటున్నారు చిరంజీవి. చిరంజీవి 150వ సినిమా విడుదలకు ఇంకా ఏడు రోజులే వుంది. ఏడవ తేదీన ప్రి-రిలీజ్‌ ఫంక్షన్‌.. గుంటూరు జిల్లాలో జరగబోతోంది. అందుకే ప్రమోషన్‌ను షురూ చేశారు. వేలాదిగా అభిమానుల్ని తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అరవింద్‌ మంగళవారంనాడు సభాస్థలికి వెళ్ళి పర్యవేక్షించారు.


'మా' టీవీకి చెందిన సిబ్బంది తన కెమెరాలు ఎక్కడ పెట్టాలో పరిశీలిస్తున్నారు. వారంతా పోలీసు అధికారులతో భేటీ అయ్యారు. ఎక్కడనుంచి ఊరేగింపుగా రావాలో.. ఎక్కడ ఆంక్షలు వుంటాయో విధిగా ఉన్నతాధికారులు అరవింద్‌కు వెల్లడించారు. కాగా.. ప్రమోషన్‌లో భాగంగా చిరంజీవికి చెందిన వీడియోను తయారుచేశారు. బుధవారంనాడు దాన్ని విడుదల చేశారు. 
 
''వచ్చాడు వచ్చాడు.. చిరంజీవి వచ్చాడు! సైడ్‌ ఇవ్వరా భాయ్‌.. చిరునవ్వు ఇస్తాడు.. లేచి స్టెప్‌ వేయరా భాయ్‌! అంటూ..సాగే పాటతోపాటు చిరంజీవి చిన్నతనంనుంచి  ఠాగూర్‌ వరకు చిత్రాల స్టిల్స్‌ వున్నాయి. అందులో నాటి ఎన్‌టిఆర్‌. బాలకృష్ణ. ఇప్పటి ఎన్‌టిఆర్‌.. రాజశేఖర్‌, మహేస్‌బాబు, ఇలా అందరితో కలిసిన ఫొటోలు చూపిస్తూ... పాట సాగుతుంది. 
 
''అన్నయ్య కమింగ్‌ బ్యాక్‌.. బోలో బోలో.... జై చిరంజీవి.. బోలో....'' అంటూ సాగుతూ.. బాస్‌ సీ బ్యాక్‌. ఎవ్రీబడీ షేక్‌‌తో అంటూ ముగుస్తుంది. మరి 150తో షేక్‌ చేయిస్తాడో లేదో చూడాలి మరి. ఇదిలావుంటే బాలయ్య తన గౌతమిపుత్ర శాతకర్ణి జెండాలతో థియేటర్లపై విరుచుకపడబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లను చూసిన బాలయ్య ఫ్యాన్స్ సింహాలయిపోయారు. ఈ నేపధ్యంలో బాస్ వర్సెస్ శాతకర్ణి పందెంలో ఎవరు గెలుస్తారో వెయిట్ అండ్ సీ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments