Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో మెగాస్టార్ 'ఖైదీ నం.150' హంగామా.. హాట్ కేకుల్లా డిస్ట్రిబ్యూషన్ రైట్స్

అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నం.150' హంగామా చేస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రం యుఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు 9 యేళ్ల తర్వాత

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (14:51 IST)
అమెరికాలో మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'ఖైదీ నం.150' హంగామా చేస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ చిత్రం యుఎస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దాదాపు 9 యేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే అన్నీ ఏరియాల డిస్ట్రూబ్యూషన్ రైట్స్ హాట్ కెకుల్లా అమ్ముడుపోయాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం హంగామా ఇప్పటికే ఆరంభమైన విషయం తెల్సిందే. 
 
పట్టణాలు - పల్లెల్లోనూ మెగా ఖైదీ బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు యుఎస్‌లోనూ మెగా ఖైదీ హంగామా మొదలైంది. యుఎస్‌లో మెగా ఖైదీ కోసం 200 థియేటర్స్ బుక్కయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని చెబుతున్నారు. మెగా ఖైదీ ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకొన్న క్లాసిక్ సినిమా సంస్థ మెగా ఖైదీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 
 
ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, లక్ష్మీరాయ్ ఒక ఐటమ్ సాంగ్‌లో నర్తిస్తోంది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి హీరో రామ్ చరణ్ తేజ్ నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఈనెల 7వ తేదీన గుంటూరు జిల్లాలో జరుగనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

ఆ నగల్లో వాటా ఇవ్వండి లేదంటే అమ్మ చితిపై నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments