Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానం ఒక్కసారిగా పెల్లుబుకింది... కోట్లు కురిపిస్తున్న ఖైదీ నెం. 150

చిరంజీవిపై వున్న అభిమానాన్ని ఒక్కసారిగా ప్రేక్షకులు బయటపెట్టి చిత్ర విజయానికి దోహదపడ్డారని.. నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' విజయాన్ని గురించి బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. విడుదలైన అన్ని సెంటర్లలోనూ బాగా ఆడుతోం

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (20:09 IST)
చిరంజీవిపై వున్న అభిమానాన్ని ఒక్కసారిగా ప్రేక్షకులు బయటపెట్టి చిత్ర విజయానికి దోహదపడ్డారని.. నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' విజయాన్ని గురించి బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. విడుదలైన అన్ని సెంటర్లలోనూ బాగా ఆడుతోంది. ఈ రోజుకూ హౌస్‌ఫుల్‌తో ఆడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 76 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్‌లో 100 కోట్లను క్రాస్‌ చేసిందని పేర్కొన్నారు.
 
కలెక్షన్ల వివరాలు తెలుపుతూ కర్నాటకలో రూ. 9 కోట్లు, నార్త్‌ ఇండియా రూ.1.3 కోట్లు.. నార్త్‌ అమెరికా రూ.17 కోట్లు.. మిగిలిన ప్రాంతాల్లో రూ.3.99 కోట్లు.. ఒరిస్సా రూ.40 లక్షలు, తమిళనాడు రూ.60 లక్షలు..  మొత్తం 108.48 కోట్లు వసూలయిందని తెలిపారు. ఇంకా భారీ వసూళ్ళను రాబట్టనుందనీ, ఈ వారంలోనే ఫ్యాన్స్‌తో కలిసి చిత్ర యూనిట్‌ పాలుపంచుకోనున్నదని అప్పుడు చిరంజీవిగారు వస్తారని తెలిపారు.
 
వినాయక్‌ మాట్లాడుతూ... అన్నయ్య 150 చిత్రానికి ఇంతటి భారీ రెస్పాన్స్‌ ఊహించలేదు. ఎక్కడ చూసినా విపరీతంగా అభిమానాన్ని చూపిస్తున్నారు. చాగల్లు లాంటి గ్రామంలో సినిమా 5 లక్షలు వసూలు చేయడం గ్రేట్‌.. అలాంటి చోట్ల 7 కోట్లు, వైజాగ్‌లో 17 కోట్ల షేర్‌ వచ్చింది. చిరంజీవి స్టామినా తగ్గలేదనేందుకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. నైజాంలో అన్యాయం జరిగిందని వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ల బట్టి మీరే ఊహించుకోండనీ.. ఎలాంటి నెగెటివ్‌ ఆలోచనలు పెట్టుకోవద్దని వారికి సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగం, కళ్ల కింద నల్లని చారలు, విపరీతమైన ఒత్తిడి, ఓ ఉద్యోగిని సూసైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments