Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ నెం.150 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' పాటకు సూపర్ రికార్డు.. 20లక్షల వ్యూస్‌తో?

మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెం.150 ఆడియో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోని 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అంటూ సాగే పాటకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. దీంతో అతి తక్కువ వ్యవధిలో 20 లక్షల వ్యూస్ త

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:11 IST)
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెం.150 ఆడియో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలోని 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అంటూ సాగే పాటకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. దీంతో అతి తక్కువ వ్యవధిలో 20 లక్షల వ్యూస్ తో రికార్డు నెలకొల్పింది. ఇదే పాట వారం రోజులు తిరిగేసరికి యూ ట్యూబ్‌లో రికార్డులను తిరగ రాస్తూ దూసుకుపోతోందని లహరి మ్యూజిక్ తెలిపింది.
 
వారం రోజుల్లో 60లక్షల హిట్లు సాధించిందని లహరి మ్యూజిక్ అధికారిక ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మూడో పాటను ఈ నెల 28న విడుదల చేయనున్నట్టు యూనిట్ తెలిపింది. ఇప్పటికే ఈ సినిమాలో 'అమ్మడు కుమ్ముడు', 'సుందరి' పాటలు విడుదలైన సంగతి తెలిసిందే.
 
కాగా.. మెగాస్టార్ చిరంజీవి త్వరలో 'ఖైదీ నెం 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లోకి హీరోగా రీ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై హైప్ ఓ రేంజిలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అంచనాలకు మించేలా జరుగుతోంది. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా ఎవరూ ఊహించని రేటుకు అమ్ముడు పోయాయి. ఓ ప్రముఖ టెలివిజన్ సంస్థ రైట్స్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments