అంతేనా తమ దేశంలో తమ లొకేషన్‌లో షూటింగ్ చేస్తున్నందకు ఎంతో సంతోషిస్తూ.. కృతజ్ఞతాభినందనలు తెలిపారు. 'ఖైదీ నంబర్ 150' చిత్రానికి ఉన్న పాపులారిటీని, క్రేజును అడిగి మరీ తెలుసుకున్నారు. అసలింతకీ ఎవరా అతిథి?.. అంటే డుబ్రొవోనిక్ మేయర్ ఆండ్రూ వ్లాహుసిక్. అంతేకాదు.. డుబ్రొవోనిక్ వచ్చి షూటింగ్ చేస్తున్నందుకు మెగాస్టార్‌కి, కాజల్ సహా యూనిట్‌కి ధన్యవాదాలు చెప్పారు. మేయర్ స్వయంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి విష్ చేయడమే కాకుండా ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు.
భారతీయ సినిమా అంటే తనకి ఉన్న అభిమానం గురించి మేయర్ మాట్లాడారు.. డుబ్రొవోనిక్ టూరిజం అభివృద్ధికి 'ఖైదీ నంబర్ 150' షూటింగ్ సాయపడుతుందన్నారు. డుబ్రొవోనిక్‌లో చిత్ర యూనిట్‌కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి మేయర్ కేర్ తీసుకున్నారు. అన్నట్టు.. మెగాస్టార్ చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా (మాజీ) ఇండియాకి గతంలో సేవలు అందించిన సంగతి తెలిసిందే.