Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాసనసభ చిత్ర సంగీత ప‌నుల్లో కేజీఎఫ్ రవిబసుర్

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (16:08 IST)
music composings
కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించింది. ఇక కేజీఎఫ్-2 తరువాత రవిబసుర్ సంగీతం అందిస్తున్న మరో పాన్‌ఇండియా చిత్రం శాసనసభ. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పనిలు సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 
 
కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత, నేపథ్యసంగీతం పనుల్లో సంగీత దర్శకుడు  రవిబసుర్ బిజీగా వున్నారు. ఈ చిత్రం విశేషాలను నిర్మాత షణ్ముగం సాప్పని తెలియజేస్తూ  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ఇది. యూనివర్శల్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి రవిబసుర్ అందిస్తున్న సంగీతం, నేపథ్యసంగీతం మెయిన్‌పిల్లర్‌గా వుంటుంది. ఆయనతో పనిచేయడం ఎంతో గర్వంగా వుంది. శాసనసభ విషయంలో ఆయన చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధతో ఎంతో అద్బుతంగా అవుట్‌పుట్ వచ్చింది.కేజీఎఫ్-2 తరువాత తెలుగులో ఆయన నుంచి వస్తున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం మా బ్యానర్ ప్రతిష్టను పెంచేవిధంగా వుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు: రాఘవేందర్‌రెడ్డి, కెమెరా: కృష్ణమురళి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరస్పర అంగీకారంతో శృంగారం... మహిళపై భౌతికదాడికి లైసెన్స్ కాదు : కోర్టు

టెక్నాలజీ వాడకంలో బాబును మించినోడు లేరు... ఏఐతో ప్రెస్మీట్ లైవ్!!

ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం : గవర్నర్ అబ్దుల్ నజీర్

రిపబ్లిక్డే పరేడ్.. ప్రత్యేక ఆకర్షణంగా ఏటికొప్పాక బొమ్మల శకటం

హస్తిలో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments