'కేజీఎఫ్ చాప్టర్ 2' అదుర్స్.. బాహుబలి రికార్డు బ్రేక్..

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (11:28 IST)
'కేజీఎఫ్ చాప్టర్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ఈ క్రమంలోనే బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను సైతం బద్దలు కొట్టేసి.. దేశంలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది. 
 
కేజీఎఫ్ చాప్టర్ 1 వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత రాకింగ్ స్టార్ యశ్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రమే'కేజీఎఫ్ చాప్టర్ 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. 
 
ఈ సినిమా ఏప్రిల్ 14న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. చాలా ప్రాంతాల్లో ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ను మొదలు పెట్టగా.. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ అమ్ముడు అయిపోయాయి. తెలుగులోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది.
 
తెలుగులో తెరకెక్కినా దేశ వ్యాప్తంగా హవాను చూపించిన బాహుబలి మూవీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం ఏకంగా రూ. 80 కోట్లు వసూలు చేసింది. 
 
అలాగే, ఆర్ఆర్ఆర్ రూ. 58 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాలను దాటేసిన  కేజీఎఫ్ చాప్టర్ 2' రూ. 80.30 కోట్లతో ఇండియాలో నెంబర్ వన్ మూవీగా చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments