Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంపేస్తానంటున్నారు.. రక్షణ కల్పించండి : దర్శకుడు కేతిరెడ్డి

తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (09:24 IST)
తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయనీ, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని లక్ష్మీస్ వీరగ్రంథం దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఈమేరకు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీలకు ఓ లేఖ సమర్పించారు. 
 
రెండ్రోజుల క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముహూర్తపు షాట్‌ను చిత్రీకరించేందుకు కేతిరెడ్డి ప్రయత్నించారు. అయితే, పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే లక్ష్మీపార్వతి అభ్యంతరాలను వ్యక్తపరుస్తున్నారని చెప్పారు. లక్ష్మీపార్వతి వైఖరిని ఎండగడతానని శపథం చేశానని తెలిపారు. 
 
అందువల్లే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలంటూ ఏపీ, తెలంగాణ డీజీపీలను కోరారు. మరోవైపు, కేతిరెడ్డిలాంటి పాపుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ అపవిత్రమైందని పేర్కొంటూ... ఎన్టీఆర్ సమాధికి పాలాభిషేకం చేశారు లక్ష్మీపార్వతి. తనను, ఎన్టీఆర్‌ను అగౌరవపరిచేందుకే ఈ సినిమాను తీస్తున్నారని మండిపడ్డారు. తల్లి, చెల్లి ఉన్నవారు ఇలాంటి పనులు చేయరని ఆమె దుయ్యబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments