మహానటి అభిమానులకు గుడ్ న్యూస్: నెగెటివ్ అనేది పాజిటివ్‌గా మారింది

Webdunia
మంగళవారం, 18 జనవరి 2022 (13:14 IST)
Keerthy Suresh
మహానటి అభిమానులకు గుడ్ న్యూస్. కీర్తి సురేష్ క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకుంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపింది. తనకు నెగటివ్ రిపోర్ట్ వచ్చినట్లు కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. ఈ నెల 11న కీర్తి సురేష్ త‌న‌కు క‌రోనా పాజిటివ్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని, ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. 
 
ఈ నేపథ్యంలో వారం రోజుల్లోనే ఆమె కోలుకుందని కీర్తి సురేష్ తెలిపింది. "ఈ రోజుల్లో నెగెటివ్ అనేది పాజిటివ్ అంశంగా మారింద‌ని, తాను కోలుకోవాల‌ని తనపై మీరంద‌రూ చూపించిన ప్రేమ‌, ప్రార్థ‌న‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు. అంద‌రూ సంక్రాంతి పండ‌గను ఆనందంగా జ‌రుపుకున్నార‌ని ఆశిస్తున్నాను" ట్వీట్ చేసింది. అంతేకాదు.. క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాతి ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nitish Kumar, ముస్లిం మహిళ హిజాబ్‌ను ముఖం నుంచి లాగి వివాదంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ (video)

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ.. గోదావరి జిల్లాల్లో కోడి పందేల కోసం అంతా సిద్ధం

నల్లగా ఉందని భర్త... అశుభాలు జరుగుతున్నాయని అత్తామామలు.. ఇంటి నుంచి గెంటేశారు...

Jana Sena: పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటు

విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ - స్కూల్‌కు కంప్యూటర్ల వితరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments