Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్‌లో ''మహానటి''గా కీర్తి సురేష్?

మహానటుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Webdunia
సోమవారం, 2 జులై 2018 (12:21 IST)
మహానటుడు, నటసార్వభౌముడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన తండ్రి బయోపిక్‌ గురించి బాలకృష్ణ ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎవరెవరు ఏ పాత్రలు పోషిస్తున్నారా అని ప్రేక్షకులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
ఇప్పటికే ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌, ఏఎన్నార్‌ పాత్రలో నాగచైతన్య, సూపర్‌స్టార్‌ కృష్ణగా మహేశ్‌బాబు నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ‌ సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్‌ని ఎంపికచేసుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. 
 
''మహానటి'' చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయిందని.. ఆమె పాత్రలో కీర్తి తప్ప మరెవ్వరూ నటించలేరని సినీ యూనిట్ భావించిందట. అందుకే సావిత్రి పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని పాత్రల కోసం ప్రస్తుతం ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. దర్శకుడు క్రిష్‌ నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments