Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి గంటలు మోగితే ఖచ్చితంగా చెప్తా : కీర్తి సురేస్

Webdunia
ఆదివారం, 4 జూన్ 2023 (18:14 IST)
చిత్రసీమలో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్‌ పేరు కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ అమ్మడు తన పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు చెక్‌ పెడుతూ వస్తుంది. 
 
ఇటీవల కీర్తి తండ్రి కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తిని కొందరు డైరెక్ట్‌గా పెళ్లి గురించి అడిగారు. దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
 
తమిళంలో కీర్తి నటించిన తాజా చిత్రం ‘మామన్నన్‌’ ఆడియో రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటుచేసింది. అందులో ఆమె మాట్లాడుతుండగా కొందరు.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారట నిజమేనా.. అంటూ వరుస ప్రశ్నలు వేశారు. 
 
దీంతో  కీర్తి 'నా పెళ్లిపై వస్తున్న రూమర్స్‌ గురించి నేను ఇప్పటికే ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చాను. మీరంతా దాని గురించే ఎందుకు అడుగుతున్నారు..? ఆ విషయంపై ఎందుకింత ఆసక్తిగా ఉన్నారు..? నాకు పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను. దాని గురించి మీరు ప్రెస్‌మీట్‌లలో ప్రతిసారి అడగొద్దు. ఇలాంటి ప్రశ్నలు కాదు..  సినిమాకు సంబంధించినవి అడగండి' అని ఘాటుగా అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments