మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు భలే ఆసక్తిగా మారాయి. మీడియాకు మరింత హాట్ న్యూస్ దొరికింది. ఒకసారి ప్రకాష్‌రాజ్, మరోసారి మంచు విష్ణు, ఇంకోసారి సివిఎల్. నరసింహారావు ఇలా మీడియా ముందుకు వచ్చి ప్రచారాన్ని వినియోగించుకుంటున్నారు. ఏదో కొత్త విషయం రాబోతుందనేదానిపై అంతా ఆసక్తి కనబరిచారు. మంగళవారం ఉదయమే ప్రకాష్‌రాజ్ ప్రెస్‌మీట్ పెట్టి పోస్టల్ బేలట్ మంచు విష్ణుకు అనుకూలంగా వుందని విమర్శించారు. ఇంత రాజకీయమా? అంటూ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మంచు విష్ణు దీనిపై కౌంటర్ వేయడానికి సిద్ధమయ్యారు. కానీ అప్పటికే మీడియా అంతా హాజరయ్యారు. మంచు విష్ణు ప్రెస్‌మీట్‌కుముందు అరగంట ముందు పోటీనుంచి విరమించుకున్న సివిఎల్. నరసింహారావు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందులో హేమ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సివిఎల్. మాట్లాడుతూ, రేపు ఎవరు గెలుస్తారో వారికి 10కోట్ల రూపాయలు అందజేస్తానని ప్రకటించారు. `మా` బిల్డింగ్ కోసం తనకు బయట వ్యక్తులు ఇలా సాయం చేశారని ఆ వివరాలు అన్నీ గెలిచిన ప్రెసిడెంట్‌కు సమర్పిస్తానని అన్నాడు.
అనంతరం మంచు విష్ణు ప్రెస్‌మీట్ జరగాల్సి వుండగా, దళిత బంధు గురించి మీడియా అంతా లైవ్‌లో కె.సి.ఆర్. గురించే చూపించడం జరుగుతుందనీ, అందుకే కాస్త లేట్‌గా రండి అని కొందరు సూచించారు. దాంతో ఆయన 5గంటలకు హాజరై ప్రకాష్‌రాజ్‌పై కౌంటర్ వేశాడు.