Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

దేవీ
శుక్రవారం, 13 జూన్ 2025 (19:03 IST)
Kavya Kalyan Ram
కావ్య క‌ళ్యాణ్ రామ్..ఈ పేరుకి కొత్తగా పరిచయం అవసరం లేదు....బాల న‌టిగా గంగోత్రి, ఠాగూర్‌, బాలు, బ‌న్ని వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌లో స్టార్‌ హీరోలంద‌రితో న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది..ఇక దిల్ రాజు బేన‌ర్‌లో వ‌చ్చిన మ‌సూద చిత్రంతో హీరోయిన్‌గా పరిచ‌య‌మైంది కావ్య కళ్యాణ్ రామ్‌. హీరోయిన్‌గా కూడా మొద‌టి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్‌లో వ‌చ్చిన బ‌ల‌గం సినిమాతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. బ‌లగం సినిమాలో కావ్య న‌ట‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి మ‌రింత ద‌గ్గ‌ర చేసిందన‌డంలో ఎలాంటి సందేహం లేదు..
 
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్య, తన గ్లామర్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ తెలుగు అమ్మ‌డు త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాయి. రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌తో ఉన్న కావ్య  ఫోటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.   ఈ ఫోటోలో ఆమె క్యూట్ అండ్ గ్లామరస్ లుక్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక‌ పాజిటివ్ కామెంట్లతో ఆమెను మెచ్చుకుంటున్న అభిమానులు, ఆమెను త్వరలోనే మరిన్ని సినిమాలలో చూడాలని ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం కావ్య క‌ళ్యాణ్ రామ్ రెండు ప్రాజెక్ట్స్‌తో మ‌న ముందుకు రానుంది. అతి త్వ‌ర‌లోనే వాటి విశేషాలను తెలుప‌నున్నారు మేక‌ర్స్‌..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments