Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.7 కోట్ల ప్రశ్న.. గుడ్డిగా ఆన్సర్ చెప్పింది.. తప్పా.. రైటా?

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబా బచ్చన్ ప్రధాన వ్యాఖ్యాతగా సోనీ మ్యాక్స్ టీవీ నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' సీజన్ 10లో ఓ ట్యూటర్ తొలి విజేతగా నిలిచారు. రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా ఆమె గుడ్డిగా సమాధ

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (19:19 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబా బచ్చన్ ప్రధాన వ్యాఖ్యాతగా సోనీ మ్యాక్స్ టీవీ నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా క్రోర్‌పతి' సీజన్ 10లో ఓ ట్యూటర్ తొలి విజేతగా నిలిచారు. రూ.7 కోట్ల ప్రశ్నకు కూడా ఆమె గుడ్డిగా సమాధానం చెప్పింది. నిజానికి ఆ ప్రశ్నలోని ప్రదాలే ఆమెకు సరిగా తెలియవు. కానీ గుడ్డిగా, తప్పా రైటా అన్న సంగతి పక్కనబెట్టి సమాధానం చెప్పింది. ఆమె చెప్పిన ఆన్సర్ నిజమైంది. కానీ, ఆమె మాత్రం రూ.7 కోట్ల నగదు  బహుమతికిగాను కోటి రూపాయలను మాత్రమే గెలుచుకుని ఆనందభాష్పాలనుకార్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బిగ్ బి ప్రధాన హోస్ట్‌గా హిందీలో కౌన్ బనేగా క్రోర్‌పతి సీజన్ 10 క్విజ్ పోటీ సాగుతోంది. ఇందులో అసోంకి చెందిన ట్యూటర్ బినీతా జైన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ 13వ ప్రశ్న వరకు వచ్చారు. వృత్తి రీత్యా ట్యూటర్ అయినప్పటికీ ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి. ఈమె అద్భుతంగా ఆడి అమితా బచ్చన్ నుంచి విశేష ప్రశంసలు అందుకున్నారు. 
 
నిజానికి రూ.50 లక్షల వద్ద 13వ ప్రశ్నతోటే ఆమె మొత్తం లైఫ్ లైన్లును వాడేసుకున్నారు. అయితే 14వ ప్రశ్న వద్ద ఎలాంటి సహాయం లేకుండా సమాధానం చెప్పి రూ.కోటి రూపాయలు గెలుచుకుంది. '13 మంది సుప్రీంకోర్టు జడ్జిలతో దేశంలోనే అతిపెద్ద ధర్మాసనం దర్యాప్తు చేసిన కేసు ఏది' అనే ప్రశ్నకు ఆమె "కేశవనాధ భారతి కేసు" అంటూ ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చారు. దీంతో ఆమెకు కోటి రూపాయల నగదు బహుమతి సొంతమైంది. ఈ విజయానికి ఆమెతో పాటు.. కుమారుడు, కుమార్తె, తండ్రి బినీతా జైన్ ఆనంద పరవశులైపోయారు. ఆ తర్వాత ఈ సీజన్‌లో తొలి కోటీశ్వరురాలిగా ఆమెను ప్రకటిస్తూ బిగ్ బీ సైతం అంతే ఉద్వేగంగా కనిపించారు.
 
ఆ తర్వాత చివరగా అంటే 15వ ప్రశ్నను సంధించారు. అంటే ఇది రూ.7 కోట్ల ప్రశ్న. ఒకవేళ ఇక్కడ సరైన సమాధానం చెప్పలేకపోతే కేవలం రూ.3.2 లక్షలతోనే ఆమె ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ దశలో కోటి రూపాయలతో సరిపెట్టుకునేందుకు ఆమె సిద్ధపడ్డారు. అయితే ఏదో ఒక సమాధానం చెబితే అది కరెక్టో, తప్పో తాను చెబుతానంటూ బిగ్‌బీ ప్రోత్సహించడంతో... ఆమె సందేహిస్తూనే గుడ్డిగా బదులిచ్చింది. నిజంగా.. ఆమె చెప్పిన సమాధానమే నిజమైంది. 
 
'1867లో తొలి స్టాక్ టికెట్‌ను కనిపెట్టింది ఎవరు?' అనే ప్రశ్నకు ఆమె "ఎడ్వర్డ్ కలహాన్" అని చెప్పడంతో అమితాబ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. "నమ్మశక్యంగా లేదు.." అంటూ... ఇదే రైట్ ఆన్సర్ అని ప్రకటించారు. వాస్తవానికి స్టాక్ టికెట్ అంటే ఏమిటో కూడా తనకు అర్ధం తెలియదనీ.. అయినప్పటికీ ఊహించి చెప్పిన సమాధానం తనకు ఊహించని గెలుపు కట్టబెట్టిందని బినీతా సంతోషం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments