Webdunia - Bharat's app for daily news and videos

Install App

షీనాబోరాతో కట్టప్పకు రిలీఫ్: నెటిజన్ల నుంచి బతికిపోయాడు..

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (14:18 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమౌళి బాహుబలి సినిమా రిలీజై వారాలు గడిచినా ఆ సినిమా గురించే సామాజిక వెబ్ సైట్లలో జోరుగా చర్చ జరిగేది. ముఖ్యంగా బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు... అనే దానిపై జోకులు, చర్చలు పేలేవి. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. దానికి గల కారణాలు ఏమిటి.. అనే ప్రశ్నలు నెటిజన్లను వేధించాయి. 
 
సోషల్ మీడియాలో ఇవే ప్రశ్నలు చాలా రోజులపాటు హల్ చల్ చేశాయి. అయితే, దీనికి కొందరు వెరైటీగా సమాధానాలు ఇచ్చారు. బాహుబలి చిన్నతనంలో కట్టప్ప కంచం లాక్కున్నాడని అందుకే కట్టప్ప బాహుబలిని చంపాడని కొందరు చెప్తే.. మరికొందరు మాత్రం మిర్చిలో సత్యరాజ్ భార్య నదియ మరణానికి ప్రభాస్ కారణం కావడంతో.. అందుకు ప్రతీకారంగానే కట్టప్ప బాహుబలిని చంపాడని కొందరు సోషల్ మీడియాలో వివరించారు. అయితే షీనా రాకతో కట్టప్పకు విముక్తి లభించింది.
 
ప్రస్తుతం దేశంలో షీనా బోరా హత్య కేసు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ముఖర్జీయా కుటుంబంలోని సంబంధాల గురించి ఈ ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు. షీరా బోరాను ఎవరు హత్య చేశారు…? అందుకు గల కారాణాలు ఏమిటి..? అసలు ముఖర్జీయా కుటుంబ చరిత్రలో ఎవరికి ఎవరు ఏమౌతారు..? వారి మధ్య వున్న సంబంధాలు నిజమైనవేనా..? ఇటువంటి ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. షీరా బోరా, ముఖర్జీయా గురించిన కొత్త టాపిక్ తెరపైకి రావడంతో.. పాపం కట్టప్పను పట్టించుకునే వారి సంఖ్య కాస్త తగ్గిందని నెటిజన్లు అంటున్నారు. 

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Show comments