నల్లటి బికినీ.. దానిపై పసుపు రంగు కేప్‌లో కత్తిలా కనిపిస్తున్న కత్రినా కైఫ్
బాలీవుడ్ సుందరాంగి కత్రికా కైఫ్. ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం హిట్ అయి చాలా కాలమైంది. దీంతో సినీ జనాలు.. ఆమె బాలీవుడ్ వెండితెరకు దూరమైనట్టేనని భావిస్తున్నారు. రీసెంట్‌గా ఆమె నటించిన మూడు సినిమాలు 'ఫా
బాలీవుడ్ సుందరాంగి కత్రికా కైఫ్. ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం హిట్ అయి చాలా కాలమైంది. దీంతో సినీ జనాలు.. ఆమె బాలీవుడ్ వెండితెరకు దూరమైనట్టేనని భావిస్తున్నారు. రీసెంట్‌గా ఆమె నటించిన మూడు సినిమాలు 'ఫాంటమ్', 'ఫితూర్', 'బార్ బార్ దేఖో..'లు బాక్సాఫీసు వద్ద ఫట్టయ్యాయి. తర్వాత ప్రస్తుతం తన మాజీ బోయ్‌ఫ్రెండు రణబీర్ కపూర్‌తో కలిసి 'జగ్గా జాసూస్' అనే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా విడుదలకు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి లెక్కప్రకారం అయితే ఏప్రిల్ 7వ తేదీన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈలోపు ఖాళీగా ఉండం ఎందుకని రకరకాల ఫొటోషూట్లు చేస్తోంది క్యాట్. అందులో భాగంగా సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల బ్రైడల్ ఎడిషన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంటోంది.
అక్కడ వీళ్లిద్దరూ కలిసి దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతున్నాయి. మరి కత్రినా ఫొటో షూట్ అంటే మామూలుగా ఉండదు కదా మరి.. నల్లటి బికినీ వేసుకుని, దానిపైన పసుపు రంగు కేప్ ధరించిన కత్రినా.. చక్కగా మనీష్ ఒళ్లో కూర్చుని మరీ ఓ ఫొటో తీయించుకుంది.
ఆ ఫొటోను మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, దానికి 'పోజర్స్ ఇన్ మాల్దీవ్స్' అనే క్యాప్షన్ పెట్టాడు. అంతేకాదు.. కత్రినా, మిగిలిన టీం అంతా ఉంది కదా అని తన బర్త్‌డే కూడా అక్కడే చేసేసుకున్నాడు. ఇక కత్రినా కూడా మరో తెల్లటి దుస్తులతో కూడిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తెగ ట్రెండవుతున్నారు.