Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా కథ వెనుక కథ

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (17:55 IST)
katha venuk katha
కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నారు. ఇది వ‌ర‌కే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 
 
డైరెక్ట‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడు (విశ్వనాథ్‌) ఓ క‌థ‌ను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌క‌పోవ‌టంపై ఓ క‌థ‌ను త‌ను రెడీ చేసుకుంటాడు. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు క‌నిపించ‌కుండా పోవ‌ట‌మే కాదు.. హ‌త్య‌కు కూడా గుర‌వుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయ‌టానికి ఓ పోలీస్ ఆఫీస‌ర్ (సునీల్) వ‌స్తాడు. త‌ను అనుమానాస్ప‌దంగా ఉంటూ డైరెక్ట‌ర్ కావాల‌నుకునే యువ‌కుడిని అరెస్ట్ చేస్తాడు. అస‌లు అమ్మాయిలు సిటీలో క‌నిపించ‌కుండా పోవ‌టానికి  కార‌ణం ఎవ‌రు? ఆ క్రైమ్ వెనుకున్న గ్యాంగ్ ఏది? అనేది  తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 
 
నిర్మాత దంద‌మూడి అవ‌నీంద్ర కుమార్ ‘క‌థ వెనుక క‌థ’ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. సినిమాలోని పాట‌ల‌ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan seat in AP Assembly: యూపీ చట్టాలు ఏపీలో అమలు చేస్తే బాగుంటుంది..

వెనుక వంగవీటి రంగా ఫోటో, స్టేజి పైన యువతి అసభ్య భంగిమలో డ్యాన్స్ (video)

తణుకు పోలీస్ స్టేషన్ వద్ద మహిళా అఘోరీ హల్చల్ - ఆత్మహత్యాయత్నం! (Video)

SLBC Tunnel: తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు.. పది రోజులు గడిచినా? (video)

ట్రంప్-జెలన్‌స్కీ ఫైటింగ్, ట్విట్టర్ మీమ్స్ నవ్వలేక పొట్ట చెక్కలవుతోంది(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments