Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడు'కి ఖడ్గం.. శివబాలాజీ గిఫ్ట్.. సెట్స్‌లో సందడి.. ఫన్ వీడియో చూడండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో ఫన్ సీన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. ఈ చిత్రంలో పవన్ సోదరుడిగా నటిస్తున్న

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (12:27 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌లో ఫన్ సీన్స్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందుకున్నారు. ఈ చిత్రంలో పవన్ సోదరుడిగా నటిస్తున్న శివబాలాజీ పవన్ కోసం ప్రత్యేకంగా ఓ కత్తిని తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. పవన్‌కు  వీరాభిమాని అయిన శివబాలాజీ తన అభిమానాన్ని చాటుకునేందుకు పవన్‌ షాక్ అయ్యేలా ఓ ఖడ్గాన్ని ఇచ్చారు. ఆ ఖడ్గంపై పవన్ ఫోటో ఉంది. ఇంకా జనసేన లోగోను కూడా డిజైన్ చేశారు. ఈ ఖడ్గాన్ని ‘కాటమరాయుడు’ సెట్స్‌కి వెళ్లి మరీ సగౌరవంగా దానిని అందజేశారు.
 
ఈ ఖడ్గాన్ని డెహ్రాడూన్‌లో తనకు తెలిసిన ఖడ్గ తయారీదారుడిని కలిసి.. తనకు నచ్చిన విధంగా డిజైన్ చేశానని.. ఈ ఖడ్గ తయారీ కోసం రోజూ తనకు తన భార్య భార్య మధుమితకు ఎన్నో ఆలోచనలు వచ్చేవి. ఒకసారి ఖడ్గం డిజైన్‌ పూర్తయ్యాక ఏం రాయించాలన్న ఆలోచన మొదలైంది. దానిపై పవర్‌ఫుల్‌ పదాలుండేలా పవన్‌గారి ఫొటోకింద ‘జనసేన’ అని రాయించాలనుకున్నాను. ఇలా తన ఐడియాస్ చెప్పుకుంటూ పోతుంటే.. డిజైనర్‌కి విసుగుపుట్టి.. నా వల్ల కాదన్నాడు. అయినా పట్టుబట్టి.. మోహన్ సాయం తీసుకుని ఖడ్గం చేయించానని చెప్పారు. ఆ ఖడ్గాన్ని పవన్‌ సర్‌కి ఇచ్చినప్పుడు ఆయన రియాక్ష‌న్‌ను మర్చిపోలేనని శివబాలాజీ చెప్పుకొచ్చారు. 
 
ఇకపోతే.. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. కిషోర్‌కుమార్‌ పార్థసాని(డాలీ) దర్శకుడు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్రంలో శివబాలాజీ పవన్‌ సోదరుడి పాత్రలో నటిస్తున్నారు. శివబాలాజీ ఇచ్చిన ఖడ్గంతో కాటమరాయుడు టీమ్ ఎలా పండగ చేసుకుందో ఈ వీడియో ద్వారా చూడండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments