Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.వంద కోట్ల క్లబ్ దిశగా నిఖిల్ సిద్ధార్థ్ "కార్తికేయ-2"

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (13:58 IST)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం "కార్తికేయ-2". ఈ నెల 13వ తేదీన విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరభారతంలో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుని, సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హిందీలో ఇప్పటికే రూ.15 కోట్ల మేరకు వసూళ్లు రాబట్టి, ప్రపంచ వ్యాప్తంగా రూ.75 కోట్ల మేరకు కలక్షన్లు వసూలు చేసింది.
 
అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ కథ తిరుగుతుంది. ఆ రహస్యం ఏంటన్నది తెలుసుకోవడానికి ద్వారకలో హీరో సాగించే అన్వేషణే ఈ సినిమా పూర్తి స్టోరీ. 
 
విడుదలైన తొలి రోజే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్‌లో ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వచ్చింది. తొలి రోజుఅక్కడ 200 థియేటర్లలో విడుదల కాగా, మూడో రోజుకు ఈ థియేటర్ల సంఖ్య 700కి చేరింది. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఇప్పటివరకు ఒక్క హిందీలోనే రూ.15 కోట్లు రాబట్టగా, ప్రపంచ వ్యాప్తంగా రూ.75.33 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసే చేయడం ఖాయమని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. కాగా, హీరో నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిత్తూరు జిల్లాలో హెచ్‌సిసిబి సీఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్

Amaravati: ఆగస్టు 15న ప్రారంభం కానున్న అమరావతి సీఆర్డీఏ కార్యాలయం

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

AP: ఒడిశా నుంచి కేరళకు బొలెరోలో గంజాయి.. పట్టుకున్న ఏపీ పోలీసులు

ప్రజ్వల్ రేవన్నకు చనిపోయేంత వరకు జైలు - నెలకు 2 సార్లు మటన్ - చికెన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments