Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక దీపం కార్తీక, సౌందర్యల వయస్సు తెలిస్తే షాకే...

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (23:04 IST)
బుల్లితెరపై గత మూడేళ్లకు పైగా మొదటి ప్లేస్‌లో కొనసాగుతోంది కార్తీకదీపం సీరియల్. దేశ, విదేశాల్లో తెలుగు లోగిళ్లలో కార్తీక దీపం అభిమానులు లేనివాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ సాయంత్రం 7.30 నిమిషాల అవుతుందంటే చాలు టివి స్క్రీన్ ముందుకు చేరుకుంటారు.
 
అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్. ధారావాహిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కార్తీక్, దీప, సౌందర్య, మౌనిక నుంచి పనిమనిషి ప్రియమణి వరకు క్రేజ్‌ను సొంతం చేసుకున్నవారే. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే హీరో కార్తీక్ తల్లిగా నటిస్తున్న సౌందర్య స్వతహాగా కన్నడ.
 
అయితే తన నటనతో తెలుగింటి ఆడపడుచులా మంచి పేరును సొంతం చేసుకుంది. సౌందర్య పాత్రలో జీవిస్తున్న అర్చన ఒకవైపు కొడుక్కి ప్రేమ చూపిస్తూనే అతను చేస్తున్న తప్పును ఎత్తి చూపుతూ కోడలు దీపకు అండగా ఉండే సౌందర్య ఒక రేంజ్‌లో ఫాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది.
 
బుల్లితెరపై అందమైన రూపంతో పాటు మంచి మనస్సున్న అత్తగా ఆకట్టుకుంది. అయితే ఇందులో తల్లీకొడుకులుగా నటిస్తున్న నిరుపమకు, అర్చనకు నిజజీవితంలో వయస్సు తేడా తెలిస్తే షాక్ అవుతారు. కర్ణాటకలో పుట్టిపెరిగిన అర్చన సీరియల్స్‌లో నటిగా అడుగుపెట్టకముందు బ్యూటీషియన్‌గా పనిచేశారట.
 
ఒక వ్యాపారవేత్తను పెళ్ళి చేసుకున్న అర్చనకు ఒక బాబు కూడా ఉన్నాడట. 1988 జనవరి 3వ తేదీన జన్మించిన అర్చన వయస్సు ప్రస్తుతం 33 యేళ్ళు. ఇక టాలీవుడ్ నటుడు, నిర్మాత, కథా రచయిత ఓంకార్ కుమారుడు పరిటాల నిరుపమ్. నిరుపమ్ కూడా 1988 ఫిబ్రవరి 17న జన్మించాడు. 
 
తన సహనటి మంజులను నిరుపమ్ వివాహం చేసుకున్నారు. అయితే కార్తీకదీపం సీరియల్‌లో తల్లిగా అర్చన, కొడుకుగా నిరుపమ్ నటిస్తున్నప్పటికీ ఇందులో వారిద్దరి మధ్య వయస్సు తేడా 43 రోజులు మాత్రమే. అయినప్పటికీ వయస్సును మించిన పాత్రలో కార్తీక్‌కు తల్లిగా, సౌందర్య ఒక రేంజ్‌లో నటిస్తూ తల్లి అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments