Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగలో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కి అందరూ కనెక్ట్ అవుతారు: కార్తీ

Webdunia
సోమవారం, 25 నవంబరు 2019 (19:26 IST)
ఖైదీ లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగగా రాబోతున్నాడు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'దొంగ' ఫస్ట్ లుక్‌ను ఇటీవలే హీరో సూర్య, టీజర్‌ని కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెకండ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో హీరో కార్తీ వదిన, హీరో సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు.
 
ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ, " 'దొంగ' నా కెరీర్లో మరో విభిన్న చిత్రం. వెరైటీ చిత్రాలని ఆదరించే ప్రేక్షకులు ఈ సినిమాని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. దొంగలో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కి అందరూ కనెక్ట్ అవుతారు. మా వదిన గారు జ్యోతిక ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సత్యరాజ్ గారు మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నా కెరీర్లో మరో మెమొరబుల్ ఫిలిం."  అన్నారు.
 
నిర్మాణ సంస్థలు వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్‌ మైండ్స్‌ సినిమా గురించి వెల్లడిస్తూ, " షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. వరల్డ్‌వైడ్‌గా డిసెంబర్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము" అని అన్నారు. 
 
ఖైదీతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కార్తీకి దొంగ మరో బ్లాక్‌బస్టర్ కాబోతుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. 
యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌, సంగీతం: గోవింద్‌ వసంత, నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా, దర్శకత్వం: జీతు జోసెఫ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments