Webdunia - Bharat's app for daily news and videos

Install App

చారిత్రక నేపథ్య కథతో కార్తీ 29 సినిమా ప్రకటన - 2025లో రిలీజ్ కు ప్లాన్

డీవీ
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (10:23 IST)
Karti 29 poster
ఈమధ్య భారత్ అన్ని భాషల్లో అగ్రహీరోలతో చారిత్రక నేపథ్య కథలతో సినిమాలు వస్తున్నాయి. పొన్నియమ్ సెల్వన్ తర్వాత తమిళ హీరో కార్తీ తన 29వ సినిమాను చేయనున్నాడు. ఈ చిత్రకథ వందల ఏళ్ళనాటి కథగా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. సముద్రంలో నావ ఎదురురావడం సరికొత్తగా అనిపించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 
 
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న హీరో కార్తి. ఇప్పుడు, కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #కార్తీ 29కి డైరెక్టర్ చేయడానికి కి టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ్‌ని ఎంచుకున్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన తానాఅక్కరన్‌తో మూవీతో తమిళ్ అందరినీ ఆకట్టుకున్నారు.  
 
ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నేతృత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కార్తీ కలిసి తీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో పాటు కాష్మోరా, జపాన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అలరించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
 
మాగ్నమ్ ఓపస్  #కార్తీ29ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో పాటు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా,  రాజా సుబ్రమణియన్ నేతృత్వంలోని ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి.
 
ఈ సినిమాను 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. #కార్తీ29  ఇతర తారాగణం, టెక్నికల్ టీం అప్‌డేట్‌లను ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెలియజేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

వీధి కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి బావిలో దూకిన వ్యక్తి.. తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments