రేవ్ పార్టీలో నటి హేమ ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారా..? కోర్టు కామెంట్స్ ఏంటి?

ఠాగూర్
గురువారం, 2 జనవరి 2025 (15:00 IST)
సినీ నటి హేమకు బెంగుళూరు కోర్టు ఊరటనిచ్చింది. బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్ సేవించారంటూ ఆమెపై బెంగుళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ విచారణపై కర్నాటక హైకోర్టు స్టే విధించింది. ఈ రేవ్ పార్టీ కేసులో నటి హేమను పోలీసులు అరెస్టు చేయగా రిమాండ్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో తదుపరి చర్యలపై హైకోర్టు స్టే విధించింది. 
 
రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ డ్రగ్ తీసుకున్నారని నిరూపించే ఆధారాలు లేవని జస్టిస్ హేమంత్ చందన గౌడర్ అన్నారు. సహ నిందితుల ఒప్పుకోలు ప్రకటన ఆధారంగానే పిటిషనర్‌పై చార్జిషీటు వేశారని గుర్తుచేశారు. 8వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి, బెంగుళూరు రూరల్ ఎన్డీపీఎస్ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు పెండింగ్‌లో ఉన్న చార్జిషీటు, తదుపరి విచారణపై స్టే కోరుతూ హేమ ఇంటర్ లొకేటరీ అప్లికషన్‌ను దాఖలు చేసింది. దీన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆమెపై తదుపరి చర్యలపై స్టే విధించింది. ప్రస్తుతం హేమ బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments