Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోల రెమ్యునరేషన్ పై కరణ్ జోహార్ డైలాగ్స్ అందరికీ వర్తించేనా?

డీవీ
శనివారం, 13 జులై 2024 (15:09 IST)
Karan Johar
జాతీయస్థాయిలో నిర్మాత దర్శకుడు నటుడు అయిన కరణ్ జోహార్.. మాటలు పలు వివాదాలకు తావిస్తుంటాయి. కాఫీ విత్ కరణ్ షో..లో పలు రకాల అంశాలను ఆయన టచ్ చేస్తుంటారు. ఈసారి ఏకంగా సినిమా హీరోలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఎవరిపై వేశాడనేది పెద్ద చర్చకు తావిచ్చింది. ఫస్ట్ డే మూడు కోట్లు కూడా కలెక్టణ్ చేయని హీరోలు ఏకంగా ముప్పై కోట్లు రెమ్యునరేషన్ అడుగుతున్నారని వ్యాఖ్యాలు చేశారు.
 
కలెక్లన్లను తీసుకురాలేని హీరోలు కోట్లు డిమాండ్ చేయడం ఏమిటనే ప్రశ్న అందరిలో తలెత్తింది. హీరోల పారితోషికం వల్ల బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతకు చాలా నష్టం చేకూర్చిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో తెలుగు సినిమా నిర్మాతలు చాలాసార్లు ఛాంబర్ ద్రుష్టికి తీసుకువచ్చారు. ఆమధ్య కరోనా టైంలో కొంత పారితోషికం తగ్గించుకుంటామనే కొందరు తెలియజేసినా, ఆ తర్వాత పరిణామలు పాన్ ఇండియా సినిమాగా మారడంతో హీరోలు పారితోషిం తగ్గేదేలే అన్నట్లుగా మారింది.
 
బాలీవుడ్ లో పదిమంది ఫెద్ద హీరోలున్నారు. వారు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. దానికి అనుగుణంగా నిర్మాత సినిమా చేయాలి. ఆ తర్వాత మార్కెటింగ్ చేయాలి. ఇది ఎంతవరకు వెళుతుంది. రిలీజ్ తర్వాత సినిమా బాగోలేదని టాక్ వస్తే నిర్మాతకు హీరో రెమ్యునరేషన్ డబ్బులు కూడా రావు అనేది కరణ్ మాట. ఇది ముఖ్యంగా తెలుగు హీరోలకు బాగా వర్తిస్తుందని టాక్ కూడా నెలకొంది. కొందరు హీరోలు సక్సెస్ లేకపోయినా డిమాండ్ బాగా చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. 
 
తాజాగా అక్షయ్ కుమార్ సినిమా విడుదలైంది. కానీ ఓపెనింగ్స్ పెద్దగా లేవు. అలాగే మరికొంతమంది హీరోల సినిమాలు విడుదలయ్యాయి. వారికి పెద్దగా ఓపెనింగ్స్ లేవు. ఇది బాలీవుడ్ గురించే ఆయన మాట్లాడలేదు. మొత్తం భారతీయ ఇండస్ట్రీ గురించి మాట్లాడారని కొందరు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా నిర్మాత బాధలు నిర్మాతకే తెలుసు కనుక ఇప్పటికైనా హీరోలు మారాలని కొందరు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments