Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అబ్బాయిగా పుట్టాను.. కానీ నాలో ఓ మహిళ ఉంది...

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (12:35 IST)
బాలీవుడ్‌లో తిరుగులేని నిర్మాతలలో ముందుగా వినిపించే పేరు కరణ్ జోహార్. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎన్నో సినిమాలను నిర్మించిన ఆయన అనేక సూపర్‌హిట్ సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కరణ్ ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత అర్బాజ్ ఖాన్‌ యాంకర్‌గా చేస్తున్న ‘పించ్‌’ అనే కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
అప్పుడు కరణ్‌పై నెటిజన్లు పెడుతున్న వ్యాఖ్యలను అర్బాజ్‌ చదివి వినిపించగా, వాటిలో ‘మీరు స్వలింగ సంపర్కులా?’ అన్న కామెంట్‌‌పై కరణ్‌ స్పందిస్తూ.. ‘లేదు. నేను అబ్బాయిగానే పుట్టాను. అందుకు చాలా గర్వంగా ఉంది. కానీ నాలో ఓ మహిళ కూడా ఉంది. అదే నన్ను ఓ మగాడిగా మరింత బలవంతుడిని చేస్తోంది.' అంటూ స్పందించారు.
 
ఇంతకుముందు నాపై ఇలాంటి కామెంట్స్ వచ్చాయి. అప్పుడు చాలా బాధపడేవాడిని, చాలా కోపం కూడా వచ్చేది. కానీ ఇప్పుడు నాకు అవన్నీ చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి. నా గురించి మాట్లాడుకునే హక్కు నెటిజన్లకు ఉంటుంది. కానీ నాలో ఏదో లోపం ఉంది, వ్యాధి ఉందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని వారిని అభ్యర్థిస్తున్నాను. 
 
అలా ఎవరైనా మాట్లాడారంటే వాళ్ల నోరు మూయిస్తాను. నాపై వచ్చే కామెంట్ల కన్నా నా పిల్లల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే నాకు విపరీతంగా కోపం వస్తుంది. ఎందుకంటే నా పిల్లల విషయంలో నేను చాలా సున్నితంగా ఉంటాను. ఎవరైనా వారిని ఏమైనా అంటే తట్టుకోలేనని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం