Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (16:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రాల్లో "కన్నప్ప" ఒకటి. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొంతమంది ట్రోలింగ్ చేస్తున్న నేపథ్యంలో నటుడు రఘుబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
"కన్నప్ప' సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇపుడే.. శివుని ఆగ్రహానికి శాపానికి గురువుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్" అని అంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. 
 
'కన్నప్ప' సినిమా శ్రీకాళహస్తి ఆలయ మహాత్మ్యంలో ముఖ్యమైన భాగమైన భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాలో విష్ణు మంచుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఏవీవీ ఎంటర్‌‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్ మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments