బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

ఠాగూర్
మంగళవారం, 20 మే 2025 (19:12 IST)
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెయిల్ లభించినప్పటికీ ఆమె మాత్రం మరికొన్ని రోజులు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (కాఫిఫోసా చట్టం) కింద నమోదైన కేసులో ఆమెకు ఊరట లభించలేదు. దీంతో ఆమె మరికొంతకాలం జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
గతంలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా రన్యారావును బెంగుళూరు విమానాశ్రయంలో పోలీసులకు చిక్కిపోయిన విషయం తెల్సిందే. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన కర్నాటక హైకోర్టు దానికి కొట్టివేసిన సంగతి తెల్సిందే. 
 
దీంతో కాఫిఫోసా చట్టం కింద వారికి యేడాది పాటు బెయిల్ లభించదని అధికారులు తెలిపారు. తాజాగా ప్రత్యేక కోర్టు నటికి రన్యారావుకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కాఫిఫోసా చట్టం కింద నమోదైన కేసులో మాత్రం ఆమెకు బెయిల్ రాలేదు. దీంతో ఆమె జైలులోనే గడపాల్సివస్తుంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments