Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియాడిక్ యాక్షన్ లో కొత్త కాన్సెప్ట్ తో నవంబర్ 14న రాబోతున్న కంగువ

డీవీ
శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (09:44 IST)
Suriya, Bobby Deol
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. అక్టోబర్ 10వ తేదీన రావాల్సిన 'కంగువ' మరిన్ని హంగులతో ముస్తాభై నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు.

దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు.
 
'కంగువ' నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్, ఫైర్ సాంగ్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఆసక్తితో ప్రేక్షకులంతా వెయిట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో 'కంగువ' ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోంది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య...

Amaravati: అమరావతిలో చేనేత మ్యూజియం ఏర్పాటు.. నేతన్న భరోసా పథకంపై చంద్రబాబు

CPI Narayana: చిరంజీవితో భేటీ అవ్వడం అంటే పులికి మేకని అప్పగించినట్లే.. నారాయణ

దేశంలోని సురక్షిత నగరాల్లో హైదరాబాద్‌కు ఎన్నో స్థానం?

అక్రమ వలసల అడ్డుకట్టకు కొత్త నిబంధన అమలు : అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments