Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైఫ్‌తో లవ్‌ కాదు, బంధం మాత్రమే అంటున్న కంగనా

త్వరలో విడుదల కానున్న రంగూన్ సినిమాలో తనకూ, సైఫ్ ఆలీఖాన్‌కు మధ్య ఉన్నది లవ్ కాదు బంధమే అంటోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ని, షాహిద్‌ కపూర్‌ని.. ఇద్దర్నీ ఒకేసారి ప్రేమిస్తుంది! ఈ డబుల్ ప్రేమ ఏమిటన్నది చూడాలంటే ఈ నెల 24 వరకు వ

Webdunia
శనివారం, 18 ఫిబ్రవరి 2017 (07:09 IST)
త్వరలో విడుదల కానున్న రంగూన్ సినిమాలో తనకూ, సైఫ్ ఆలీఖాన్‌కు మధ్య ఉన్నది లవ్ కాదు బంధమే అంటోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఈ సినిమాలో  సైఫ్‌ అలీఖాన్‌ని, షాహిద్‌ కపూర్‌ని.. ఇద్దర్నీ ఒకేసారి ప్రేమిస్తుంది! ఈ డబుల్ ప్రేమ ఏమిటన్నది చూడాలంటే ఈ నెల 24 వరకు వేచి చూడాల్సిందే మరి. 
 
విశాల్‌ భరద్వాజ్‌ సినిమా ‘రంగూన్‌’ ఈ నెల 24న విడుదల అవుతోంది. అందులో కంగనా రనౌత్‌.. సైఫ్‌ అలీఖాన్‌ని, షాహిద్‌ కపూర్‌ని.. ఇద్దర్నీ ఒకేసారి ప్రేమిస్తుంది! ఎలా సాధ్యం ఏకకాలంలో ఇద్దర్ని ప్రేమించడం ఎవరో ఒకరి మీదే కదా ప్రేమ ఉంటుంది. ఇద్దరి మీదో, ముగ్గురి మీదో ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది మనకైతే.. ఇన్ని డౌట్స్‌ వస్తున్నాయి కానీ, కంగనాకు మాత్రం క్లారిటీ ఉంది. సినిమాలో.. సైఫ్‌కి కంగనా కావాలి. కంగనాకి సైఫ్‌ కావాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేరింగ్‌తో ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అతడిని ఆమె, అమెను అతడు కాపాడుకుంటూ ఉంటారు. ఆమెకు బాధ కలిగితే అతడు హర్ట్‌ అవుతాడు. అతడు బాధపడితే ఆమె హర్ట్‌ అవుతుంది. ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంటుంది. లిప్‌ కిస్‌లు కూడా ఇచ్చుకుంటారు.
 
‘అయితే ఇదంతా లవ్‌ కాదు, బంధం మాత్రమే’ అంటుంది కంగనా.మరి, షాహిద్‌ కపూర్‌తో కంగనాకు ఉన్నదేమిటి అదేనట ఒరిజినల్‌గా ప్రేమంటే!‘ ప్రేమ తనకదే ఏ కారణం లేకుండానే పుడుతుంది. సహాయాల వల్లనో, కేరింగ్‌ కారణంగానో ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టినా అది ప్రేమ కాదు. ప్రేమంటే.. మనల్ని మనకు కొత్తగా చూపించేది’ అంటోంది కంగనా! సో.. ప్రేమలో బంధం, బంధనం ఉండవని అనుకోవాలి.బంధం, బంధనం లేనివే ప్రేమ అనుకోవాలి... అవునా కంగనా
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments