Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా స్థానంలో మీ కుమార్తె శ్వేత ఉంటే.. జయాబచ్చన్‌పై కంగనా ఫైర్

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (14:12 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్‌పై బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ మండిపడ్డారు. తన స్థానంలో మీ కుమార్తె శ్వేతా బచ్చన్ ఉంటే మీరు ఇలాగే మాట్లాడుతారా అంటూ కంగనా సూటిగా ప్రశ్నించారు.
 
డ్రగ్స్‌ విషయంలో సినీ పరిశ్రమపై నిందలు వేస్తున్నారని, సొంత పరిశ్రమకే ద్రోహం చేస్తున్నారని, ఆ రంగానికి ప్రభుత్వ మద్దతు కావాలని బయాబచ్చన్ మంగళవారం రాజ్యసభలో కోరారు. దీనిపై స్పందించిన హీరోయిన్ కంగనా రనౌత్.. జయాబచ్చన్‌పై మండిపడుతూ ట్వీట్ చేసింది.
 
'జయా జీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ స్థానంలో మీ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ ఉంటే కూడా ఇలాగే మాట్లాడేవారా? మీ కూతురు శ్వేత టీనేజ్‌లో నాలా బాలీవుడ్‌లో దెబ్బలు తిని, డ్రగ్స్‌కు అలవాటుపడి, లైంగిక వేధింపులకు గురైతే ఇలాగే మాట్లాడతారా? 
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా మీ కుమారుడు అభిషేక్ బచ్చన్ తరుచూ వేధింపుల గురించి ఫిర్యాదు చేసి, చివరకు ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే వ్యాఖ్యలు చేస్తారా? మాపై కూడా కాస్త దయ చూపండి' అని కంగనా రనౌత్ కాస్తంత కఠువుగా ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం