తలైవి లుక్ వైరల్: పది కేజీలు పెరిగిన కంగనా రనౌత్

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (16:58 IST)
Kangana Ranaut
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌గా తలైవి రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జయలలిత పాత్రధారిగా బాలీవుడ్‌ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ నటిస్తోంది. ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళనాడు దివంగ‌త ముఖ్యమంత్రి, పాపులర్ నటుడు ఎం.జి. రామ‌చంద్ర‌న్ పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద స్వామి న‌టిస్తుండ‌గా, మ‌రో దివంగ‌త ముఖ్యమంత్రి క‌రుణానిధి పాత్ర‌లో ప్ర‌కాశ్‌రాజ్ న‌టిస్తున్నారు. 
 
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూడు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో జయలలిత పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జయలలిత ఉన్నత స్థాయి నటిగానే కాకుండా గొప్ప డాన్సర్ గానూ కీర్తి పొందారు. 
 
ఈ లుక్‌లో శాస్త్రీయ నృత్యం చేస్తున్న భంగిమలో కంగనా అమితంగా ఆకట్టుకుంటున్నారు. చుట్టూ పలువురు డాన్సర్లు నాట్యం చేస్తుండగా, మధ్యలో జయలలితగా కంగన నాట్యం చేస్తున్న తీరు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రాజకీయ నాయకురాలిగా జ‌య‌ల‌లిత లుక్‌, టీజ‌ర్‌, ఎంజీ రామ‌చంద్ర‌న్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా ఈ సినిమా 2020, జూన్ 26వ తేదీన విడుదల కానుంది.
 
ఇకపోతే.. జయలలిత సినిమా కోసం కంగనా రనౌత్ పదికిలోల బరువు పెరిగినట్లు తెలిపింది. జయలలిత అంకితభావం విని షాక్ అయ్యానని కంగనా చెప్పుకొచ్చింది. ఈ సినిమా కోసం ప్రతీ సీన్‌కు వర్కౌట్స్ చేస్తున్నానని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దసరాకు బంద్ కానున్న మద్యం షాపులు.. డీలా పడిపోయిన మందు బాబులు

ప్రేమించిన యువతి బ్రేకప్ చెప్పిందని మోటారు బైకుతో ఢీకొట్టిన ప్రేమికుడు (video)

సుగాలి ప్రీతి కేసు: ఇచ్చిన మాట నెలబెట్టుకున్న పవన్- చంద్రబాబు

Pawan Kalyan : నాలుగు రోజులు వైరల్ ఫీవర్- హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్

NTR Statue: అమరావతిలో 100 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments