Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్‌ హాసన్‌ షార్ట్ టెంపర్.. ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు : రజనీకాంత్

విశ్వనటుడు కమల్ హాసన్‌‌లోని ఓ గుణాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయటపెట్టారు. కమల్‌ హాసన్ షార్ట్ టెంపర్ అని, ఇలాంటి వ్యక్తిని ఇంతవరకు తాను చూడలేదన్నారు. అంతేకాకుండా, కమల్‌‌లోని కోపాన్ని తగ్గించే వార

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (08:57 IST)
విశ్వనటుడు కమల్ హాసన్‌‌లోని ఓ గుణాన్ని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ బయటపెట్టారు. కమల్‌ హాసన్ షార్ట్ టెంపర్ అని, ఇలాంటి వ్యక్తిని ఇంతవరకు తాను చూడలేదన్నారు. అంతేకాకుండా, కమల్‌‌లోని కోపాన్ని తగ్గించే వారిలో నలుగురు ఉండేవారు. వారిలో ముగ్గురు చనిపోయారని చెప్పారు. అయినా కమల్‌కు ఇప్పుడు తోడుగా మేమందరం ఉన్నాం అంటూ రజనీ వ్యాఖ్యానించారు. 
 
కమలహాసన్ సోదరుడు చంద్రహాసన్ కొన్ని రోజుల క్రితం చనిపోయారు. ఆయన సంస్మరణ సభ చెన్నైలోని కామరాజ్ అరంగంలో జరిగింది ఇందులో రజనీకాంత్ పాల్గొని మాట్లాడుతూ చంద్రహాసన్ గురించి చాలా విన్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కమల్ హాసన్‌లా షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. మీరందరూ ఆయనలోని 10 శాతం కోపాన్నే చూశారు. నేను మాత్రం ఆయనలో వంద శాతం కోపాన్ని చూశాను. అందుకే, కమల్‌తో నేను జాగ్రత్తగా వ్యవహరిస్తాను. 
 
అదేసమయంలో కమల్ కోపాన్ని ఆయన పెద్దన్న చారుహాసన్, చిన్న అన్న చంద్రహాసన్ అదుపులో పెట్టేవారు. అలాగే, కమల్‌కు బాలచందర్ సార్, అనంత్, చారుహాసన్ అన్న, చంద్రహాసన్ అన్నలే జీవితం. ఈ నలుగురిలో ముగ్గురు లేరు. ఈ బాధను కమల్ ఎలా అధిగమిస్తాడోనని ఆవేదన చెందుతున్నా. అయినా కమల్‌కు తోడుగా మేమున్నాం’ అంటూ రజనీకాంత్ చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేతలు వేధించారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టిన యువకుడు తెల్లారేసరికి శవమై తేలాడు...

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

దావోస్‌‌లో అమ్మాయిల బుకింగ్స్ అదుర్స్ - రూ.కోట్లలో వ్యాపారం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments