Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్, మణిరత్నం సినిమా టైటిల్ థగ్ లైఫ్

Webdunia
మంగళవారం, 7 నవంబరు 2023 (09:36 IST)
Kamal Haasan
ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు పాన్ ఇండియా మూవీ #KH234 కోసం తిరిగి జతకట్టారు.
 
ఇటివలే గ్రాండ్ గా ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ టైటిల్ ని తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్ స్టర్ యాక్షనర్ కి 'థగ్ లైఫ్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో మైండ్ బ్లోయింగా వుంది. ఎక్స్ ట్రార్డినరీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులని కట్టిపడేసింది. వీడియోలో  కమల్ హసన్ యాక్షన్ అవుట్ స్టాండింగా వుంది. ఫైట్ సీక్వెన్స్ కమల్ హాసన్ పర్ఫార్మ్ చేసిన బ్రిలియంట్ మార్సల్ ఆర్ట్స్ మార్వలెస్ అనిపించాయి.
 
మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్ మణిరత్నం టేకింగ్ స్టన్నింగ్ అనిపించింది. రవి కె చంద్రన్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ ఈ సీక్వెన్స్ కి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళింది. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో క్షణాల్లో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది.
 
కమల్ హసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ కాంబోలో వస్తున్న చిత్రం కావడం, అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'విక్రమ్' తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో  'థగ్ లైఫ్' పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో అంచనాలు మరింతగా పెంచింది.  
 
ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, బ్యూటీఫుల్ త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
 
ఇద్దరు లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కాంబినేషన్‌ కి రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్, అన్బరీవ్ స్టంట్స్ అందిస్తున్నారు.  
 తారాగణం: కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, జయంరవి, త్రిష
 
సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్
బ్యానర్లు: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
ప్రెజెంట్స్: ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
యాక్షన్: అన్బరివ్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments