Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్ హాసన్ ఇండియా ఫిల్మ్ థగ్ లైఫ్ షూటింగ్ ప్రారంభం

డీవీ
బుధవారం, 24 జనవరి 2024 (17:54 IST)
Kamal Haasan
ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత మళ్లీ 36 సంవత్సరాల తర్వాత పాన్ ఇండియా మూవీ ‘థగ్ లైఫ్’ కోసం కలిసి సినిమా చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఈ రోజు సినిమా షూటింగ్ ప్రారంభమైయింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలియజేస్తూ ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ పంచుకున్నారు. ఈ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ లో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, జయంరవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
 
కమల్ హసన్, మణిరత్నం కల్ట్ క్లాసిక్ కాంబోలో వస్తున్న చిత్రం కావడం, అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'విక్రమ్' తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో 'థగ్ లైఫ్' పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి.  
 
కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
 
లెజెండరీ కంపోజర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్, అన్బరీవ్ స్టంట్స్ అందిస్తున్నారు.  
 తారాగణం: కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, జయంరవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ
 
సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: మణిరత్నం, నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్,  బ్యానర్లు: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్,  ప్రెజెంట్స్: ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్, సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్, యాక్షన్: అన్బరివ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments