చిక్కుల్లో కమల్ హాసన్ - బెంగుళూరు కేసు నమోదు

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (18:29 IST)
అగ్ర నటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బెంగుళూరు నగరంలో కేసు నమోదైంది. మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించిన "థగ్ లైఫ్" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, కమల్ హాసన్ ప్రసంగిస్తూ, తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందంటూ కామెంట్స్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై కర్నాటక రాజకీయ నేతలు, భాషా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కమల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక (కేఆర్వీ) ప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి కమల్ హాసన్‌పై బెంగుళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్వీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. దీంతో కమల్ హాసన్‌పై కేసు నమోదుచేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments