Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కలల హీరో కమల్ హాసన్ నుంచి విడిపోతున్నా.. నటి గౌతమి :: శృతిహాసనే కారణమా?

ప్రముఖ హీరో కమల్ హాసన్‌తో విడిపోతున్నట్టు ఆయనతో సహజీవనం చేస్తున్న నటి గౌతమి ప్రకటించారు. నిజానికి వారిద్దరు గత కొంతకాలంగా విడిపోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌తో విడిపోతున

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (15:17 IST)
ప్రముఖ హీరో కమల్ హాసన్‌తో విడిపోతున్నట్టు ఆయనతో సహజీవనం చేస్తున్న నటి గౌతమి ప్రకటించారు. నిజానికి వారిద్దరు గత కొంతకాలంగా విడిపోతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో కమల్ హాసన్‌తో విడిపోతున్నట్టు నటి గౌతమి మంగళవారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.  
 
పైగా, తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయమని తెలిపింది. 13 ఏళ్లుగా తమ సహజీవనం కొనసాగుతోందని, ఈ నిర్ణయం తనకు చాలా బాధ కలిగిస్తోందని గౌతమి పేర్కొంది. కమల్ తన కలల హీరో అని, చిన్నప్పటి నుంచి తన అభిమాన నటుడని, ఆయన నుంచి విడిపోయినప్పటికీ తన హీరో కమల్ హాసనేనని గౌతమి పేర్కొంది.
 
కమల్ హాసన్‌తో ఉన్న 13 సంవత్సరాల్లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని గౌతమి తెలిపారు. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు రాకముందే కమల్‌ తన కలల హీరో అని గౌతమి కొనియాడారు. కమల్‌కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ఆకాంక్షించారు.
 
ముఖ్యంగా.. గౌతమికి పలు విపత్కర సందర్భాల్లో కమల్ అండగా నిలిచారు. కమల్‌తో సహజీవనానికి ముందు గౌతమి వ్యాపారవేత్త సందీప్ భాటియాను 1998లో పెళ్లి చేసుకుని ఓ ఆడ బిడ్డకు జన్మినిచ్చారు. అయితే, పెళ్లైన మరుసటి ఏడాదే భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 2003 నుంచి కమల్‌తో సహజీవనం చేశారు. 
 
తెలుగులో 'విచిత్ర సోదరులు' చిత్రం నుంచి కమల్, గౌతమిల స్నేహం చిగురించింది. తమ సహజీవనం గురించి గతంలో వీరు మాట్లాడుతూ వివాహ బంధంపై తమకు అంత విశ్వాసం లేకపోవడం వల్లే సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌‌కు గురైన గౌతమి అతి కష్టం మీద ఆ వ్యాధిని జయించారు. ఆ సమయంలో ఆమెకు కమల్ తోడుగా నిలిచారు.
 
కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన గౌతమి విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గౌతమి తొలిసారిగా నటించిన చిత్రం 'దయామయులు'. ఈ సినిమా 1987లో విడుదలైంది. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. 
 
తాజాగా మలయాళ స్టార్ మోహన్‌లాల్ సరసన ఆమె మనమంతా అనే సందేశాత్మక చిత్రంలో నటించారు. చాలా సంవత్సరాల తర్వాత ఆమె నటించిన తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. అయితే వీరి బంధానికి గౌతమి ఇంత అకస్మాత్తుగా గుడ్‌బై చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరు విడిపోవడానికి స్పష్టమైన కారణం తెలియకపోయినప్పటికీ.. కమల్ కుమార్తె శృతిహాసన్‌తో వచ్చిన విభేదాలు కూడా ఓ కారణమై ఉండొచ్చని కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments