Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దహీరోలతో పోటీపడుతున్న కళ్యాణ్ రామ్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (17:23 IST)
సాధారణంగా చిన్న హీరోల సినిమా ఏదో ఒక సమయంలో రిలీజ్ చేస్తుంటారు. అగ్రహీరోల సినిమా సమయంలో అస్సలు విడుదల చేయరు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సంక్రాంతికి పెద్ద హీరోలతో తలపడతానంటున్నాడు. అగ్రహీరోలు నటించిన సినిమా తేదీలోనే తన సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్థమైపోయాడు.  
 
ఈ సంక్రాంతికి ముగ్గురు అగ్రహీరోల సినిమా విడుదలవుతున్నాయి. ఒకటి అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్. ఈ సినిమాలన్నీ సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. 
 
అయితే కళ్యాణ్ రామ్ తాను నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని నిర్ణయించేసుకున్నారు. ఇప్పటికే పోస్టర్‌ను కూడా విడుదల చేసేశారు. నా సినిమా కూడా సంక్రాంతికే విడుదల చేస్తానని అందరికీ చెబుతున్నాడు కళ్యాణ్ రామ్. ఎప్పుడూ నాన్‌కాంట్రవర్షియల్ హీరోగా ఉండే కళ్యాణ్ రామ్.. సంక్రాంతికే తన సినిమాను విడుదల చేస్తానని చెప్పడం తెలుగు సినీపరిశ్రమలో చర్చకు దారితీస్తోంది.
 
మరోవైపు ఈ సినిమాను శతమానంభవతి దర్సకుడు సతీష్ దర్సకత్వంతో తెరకెక్కుతోంది. అప్పట్లో శతమానంభవతి సినిమాను సంక్రాంతికి విడుదల చేసి భారీ హిట్ సాధించారు. ఆ ధీమాతో కళ్యాణ్ రామ్ తన సినిమాను ఈ సంక్రాంతికి విడుదల చేసి తాను హిట్ సాధించాలని అనుకుంటున్నాడట. మరి ఏం చేస్తాడో చూద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

Hyderabad Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అడిషనల్ డీఎస్పీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments