Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్బ్ గ్రాఫిక్స్‌తో "కల్కి" టీజర్ (Teaser)

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (12:58 IST)
'గరుడవేగ' చిత్రంతో ప్రేక్షకులని థ్రిల్ చేసిన డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుతం "కల్కి"గా ప్రేక్షకుల ముందుకురానున్నాడు. ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కించారు. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సినిమాకు ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. 
 
ఇటీవల ఓ టీజ‌ర్‌ విడుదల చేసి మూవీ ఫై భారీ అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ తాజాగా మరో టీజ‌ర్‌ విడుదల చేసింది. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి సినిమాఫై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇందులో ముగ్గురు క‌థానాయికలు నటిస్తుండగా, అందులో ఒక‌రు 'హార్ట్ ఎటాక్‌'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు 'బాహుబ‌లి-ది బిగినింగ్‌'లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, 'ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ' ఫేం నందిత శ్వేత.
 
ఈ చిత్రం టీజర్‌ను బుధవారం ఉదయం విడుదల చేశారు. ఇది పూర్తిగా విజువల్స్ వండర్‌గా ఉంది. టీజర్ ఓపెనింగ్ సీన్ చెట్టు కాలుతూ ఉండటం.. డ్రోన్ షాట్స్‌లో కొంతమంది నడుచుకుంటూ వెళ్లడం... బాణాలు... నదులు ఇలా సీన్స్ అన్నింటిని క్యూరియాసిటీగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్‌కు అనుగుణంగా సూపర్బ్‌గా యాప్ట్ అయ్యింది. టీజర్ ఎండింగ్‌లో రాజశేఖర్ ను చూపించిన విధానం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.  మొత్తానికి యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్ టీజర్‌తో ఆకట్టుకున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments