Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (19:06 IST)
"కల్కి" దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా రూపొందించిన "కల్కి 2898 ఏడీ" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కరిపిస్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.555 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ పదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటనను గుర్తుచేస్తూ ఓ ట్వీట్ చేశారు. 
 
"సుమారు పదేళ్ల క్రితం మేం ముగ్గురం (నాగ్‌ అశ్విన్‌, ప్రియాంక దత్‌, స్వప్న దత్‌) కలిసి మా తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' ప్రారంభించాం. నిర్మాణ సంస్థ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని తెరకెక్కించడం రిస్క్‌తో కూడుకుంది. ఎంతో జాగ్రత్తగా దాన్ని రూపొందించాం. అప్పటి ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఒక రోజు వర్షం కారణంగా షూటింగ్ చేయలేకపోయాం. దీంతో మరుసటి రోజు మళ్లీ సెటప్‌ వేయాల్సి వచ్చింది. 
 
దానికి అదనంగా చాలా ఖర్చయింది. దీంతో భయాందోళనలకు గురయ్యాం. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు మా ప్రతి సినిమా బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించడమే కాదు.. సినిమా చరిత్రలో మైలు రాళ్లుగా నిలుస్తున్నాయి. ఇలా గుర్తింపు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. వీళ్లిద్దరి మధ్యలో నిల్చోవడం అదృష్టంగా భావిస్తున్నా. మాలోని లోపాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతాం. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందకు మీ అందరికీ ధన్యవాదాలు' అని నాగ్ అశ్విన్‌ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lancet Study: భారత్‌ను వణికిస్తున్న మధుమేహం.. 10మందిలో నలుగురికి ఆ విషయమే తెలియదు!

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించబడదు.. పల్లా శ్రీనివాసరావు

అమరావతి గురించి ఏడవడం ఆపండి.. వైకాపా నేతలకు కౌంటరిచ్చిన నారాయణ

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

Google: భర్తను హత్య చేసి తప్పించుకోవడం ఎలా.. గూగుల్‌ను అడిగిన భార్య!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments