Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్కి 2989 AD పుట్టింది అక్కడనుంచే: సీక్రెట్ చెప్పిన నాగ్ అశ్విన్

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (18:16 IST)
Prabhas-kalki
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారి ప్రతిష్టాత్మకమైన చిత్రానికి అఫీషియల్ గా 'కల్కి 2898 AD' అని పేరుని ఖరారు చేసి అద్భుతమైన గ్లింప్స్ తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ సైన్స్ ఫిక్షన్, అపూర్వమైన స్టొరీ టెల్లింగ్ కలయికగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. ప్రతిష్టాత్మక శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC)లో 'కల్కి2898AD' ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. సినిమా విజన్ కాన్సెప్ట్, స్పెల్‌బైండింగ్ విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకర్షించింది. కొత్త టైటిల్ చిత్రం సారాంశాన్ని సంపూర్ణంగా సంగ్రహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికుల్లో  క్యురియాసిటీని, ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తోంది.
 
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి2898AD ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. సినిమా 2898 AD ఫ్యూచర్ లో సెట్ చేయబడింది. అద్భుతమైన కథాంశం, ఫ్యూచరిస్టిక్ అంశాల కలయికలో అసమానమైన, అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మాత సి అశ్వని దత్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు.
 
ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కామిక్-కాన్‌లో పాల్గొన్న మొట్టమొదటి ఇండియన్ సినిమాగా  కల్కి 2989 AD చరిత్ర సృష్టించింది. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రభాస్‌, కమల్ హాసన్, తో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత సి అశ్వనీ దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ చలసాని వేదికపైకి అడుగుపెట్టినప్పుడు ప్రేక్షకులు కరతాళధ్వనులతో ఘన స్వాగతం పలుకుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 
ఇంత భారీ తారాగణం గురించి అడిగిన ప్రశ్నకు దర్శకుడు నాగ్ అశ్విన్ సమాధానం చెబుతూ, "ఒక అద్భుతమైన కథ చెప్పాలనే వారి ప్రేమ మా అందరినీ ఒకచోట చేర్చింది. నేను సైన్స్ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను. మహాభారతం, స్టార్ వార్స్ రెండింటి చూస్తూ వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక సినిమా చేయడం గొప్పగా అనిపించింది, అలా 'కల్కి 2989 AD' పుట్టింది’’ అన్నారు.
 
లైవ్ జూమ్ కాల్ ద్వారా ప్యానెల్ చర్చలో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సినిమాలో భాగమైనందుకు తన ఆనందం వ్యక్తం చేశారు. "ఈ చిత్రం కోసం నాగి నన్ను సంప్రదించినప్పుడు, గతంలో అతని అత్యుత్తమ పనితీరు నన్ను ఆకర్షించింది. 'ప్రాజెక్ట్ K' ఒక అసాధారణమైన, అద్భుతమైన అనుభవం. దీని వెనుక గొప్ప పరిశోధన ఉంది. షూటింగ్ సమయంలో నేను యూనిట్ తో కొన్ని అద్భుతమైన క్షణాలను పంచుకున్నాను. కామిక్-కాన్‌లో భాగం కావడం ఆనందంగా వుంది. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీరు ఏదైతే చూడబోతున్నారో ఖచ్చితంగా నచ్చితుందని ఆశిస్తున్నాను. వచ్చే ఏడాది మేము చిత్రాన్ని విడుదల చేసినప్పుడు మరింతగా ఇష్టపడతారు’’ అన్నారు  
అలాగే " కామిక్-కాన్‌కి వెళ్తున్నామని నాగి నాకు చెప్పినప్పుడు, దిని ప్రాముఖ్యత నాకు తెలియదు. ఈ అవకాశం ఎంతగొప్పదో మా అబ్బాయి నాకు జ్ఞానోదయం చేశాడు"అని చెప్పారు బిగ్ బి.
 
కమల్ హాసన్ మాట్లాడుతూ "నేను ఇలాంటి సినిమాలుచేయడానికి ప్రయత్నించాను. ఐతే అవి చాలా చిన్నవి. 'కల్కి 2989 AD' కి పెద్ద విజన్ ఉంది. అందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నేను ట్రూపర్‌లను రూపొందించాలనుకున్నప్పుడు హాకీ మాస్క్‌లను కాస్ట్యూమ్ డిజైన్‌లో భాగంగా ఉపయోగించనట్లు గుర్తు. కానీ 'కల్కి2989AD' స్టయిల్ ని అద్భుతంగా చేసహ్రు. నాకు చాలా నచ్చింది’’ అన్నారు.
 
వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులు, నిర్మాత సి అశ్వని దత్ తన కుమార్తెలు ప్రియాంక దత్ , స్వప్న దత్ చలసానితో కలసి ప్యానెల్‌ లో పాల్గొన్నారు. "నేను నా కెరీర్‌ని ఎన్‌టి రామారావు గారితో ప్రారంభించాను, అమిత్ జీ, కమల్ జీ, నా ఫ్రండ్ ప్రభాస్‌ని చేరుకోవడానికి 50 సంవత్సరాల కష్టపడ్డాను. ఇది మాకు చాలా గర్వకారణం." అన్నారు అశ్వని దత్
 
శాన్ డియాగో కామిక్-కాన్‌లో "కల్కి 2989 AD" భారతీయ సినిమాకు ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది, ఇది భవిష్యత్తులో ప్రపంచ గుర్తింపుకు మార్గం సుగమం చేస్తోంది.
 
కల్కి 2898 AD చుట్టూ బజ్ పెరుగుతూనే ఉంది, మరిన్ని అప్‌డేట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో మేము ఖచ్చితంగా చెప్పగల ఒక విషయం ఏమిటంటే.. వైజయంతీ మూవీస్ ఈ గ్రౌండ్ బ్రేకింగ్ సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్‌తో స్టోరీ టెల్లింగ్‌ను పునర్నిర్వచించటానికి, ఇండియన్ సినిమా సామర్థ్యాన్ని ప్రపంచ వేదికపై చాటడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments