Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ప్రాజెక్ట్ కె'లో విలన్‌గా నటిస్తున్నానంటే ప్రభాస్ నమ్మలేదు : కమల్ హాసన్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (16:52 IST)
ప్రభాస్ హీరోగా ప్రాజెక్టు కె (కల్కి 2898 ఏడీ)పేరుతో ఓ చిత్రం తెరెకెక్కుతుంది. ఇందులో విశ్వనటుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ నటిస్తున్నారనే వార్త వెలుగులోకి రాగా, ఎవరూ నమ్మలేదు. ఇదే విషయాన్ని కమల్ కూడా వెల్లడించారు. ఈ సినిమాలో తాను భాగమయ్యానంటే ప్రభాస్‌ కూడా నమ్మలేదని చెప్పారు. ఈ సినిమా టైటిల్‌, గ్లింప్స్‌ రిలీజ్‌లో భాగంగా అమెరికాకు వెళ్లిన ఆయన ఓ హాలీవుడ్‌ పత్రికతో ముచ్చటించారు. ఈ సినిమా ఓకే చేయడానికి గల కారణాన్ని చెప్పారు.
 
'ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యానంటే ఎవరూ నమ్మలేదు. నిజం చెప్పాలంటే.. శాన్‌ డియాగో కామికాన్‌ ఈవెంట్‌ కోసం నేను ఇక్కడికి వచ్చిన సమయంలో ప్రభాస్‌ నా చేయి పట్టుకుని.. 'థ్యాంక్యూ సార్‌. మీరు మా సినిమాలో నటిస్తున్నారంటే ఈరోజు వరకూ నేనూ నమ్మలేదు. వాళ్లు (టీమ్‌) మిమ్మల్ని ఎలా ఒప్పించారనేది నాకింకా ఆశ్చర్యంగానే ఉంది' అని చెప్పారు. 
 
కొన్ని వేల సంవత్సరాల నుంచి మేము పురాణాలను ఫాలో అవుతున్నాం. ఆ పురాణాల గొప్పతనాన్ని చాటి చెప్పడం కోసమే నాగ్‌ అశ్విన్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. నేనూ ఇందులో సంతోషంగా భాగమయ్యా. ఒక సినిమాకి హీరో ఎంత ముఖ్యమో విలన్‌ కూడా అంతే అవసరం. అందుకే, ప్రతి నాయకుడిగా కనిపించడానికి ఓకే చేశా' అని కమల్‌ తెలిపారు.
 
నాగ్‌అశ్విన్ - ప్రభాస్‌ కాంబోలో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. భారీ బడ్జెట్‌తో వైజయంతి మూవీస్‌ పతాకంపై ఇది నిర్మితమవుతోంది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ద్వారంపూడిని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్... అలవాట్లు మార్చుకోండి..

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

ఒకే వేదికను పంచుకోనున్న టి.సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి

తిరిగేది పరదాల చాటున, అయినా 986 మంది సెక్యూరిటీయా? మాజీ సీఎం జగన్ పైన సీఎం చంద్రబాబు (video)

కొత్త ఈవీ బ్యాటరీని తయారు చేసిన తెలుగు వ్యక్తి, 5 నిమిషాల చార్జింగ్‌తో 193 కిలోమీటర్ల ప్రయాణం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

తర్వాతి కథనం
Show comments