Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్‌ రావిపూడి రిలీజ్ చేసిన `క‌ళాకార్` మోష‌న్ పోస్ట‌ర్

Webdunia
శనివారం, 14 ఆగస్టు 2021 (17:01 IST)
Kalakar motion poster
`6 టీన్స్‌ హీరో రోహిత్ న‌టిస్తోన్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క‌ళాకార్‌`. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. శ్రీను బందెల దర్శ‌కుడు. షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. ఇటీవ‌ల హీరో శ్రీ‌కాంత్ చేతుల‌ మీదుగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా `క‌ళాకార్` మూవీ మోష‌న్‌పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి రిలీజ్‌చేసి చిత్ర‌యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
 
ఈ సినిమాలో రోహిత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ మ‌హేంద్ర వ‌ర్మగా క‌నిపించ‌నున్న‌ట్లు మోష‌న్‌పోస్ట‌ర్ ద్వారా రివీల్‌ చేశారు మేక‌ర్స్‌. క్రియేటివ్‌గా మ‌రియు స్టైలిష్ గా ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. 
 
ఈ సంద‌ర్భంగా రోహిత్ మాట్లాడుతూ ``ఇటీవ‌ల విడుద‌ల చేసిన `క‌ళాకార్` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పోలీస్ ఆఫీస‌ర్ గా చాలా ఫిట్‌గా ఉన్నావు అని నా ఫ్రెండ్స్‌, స‌న్నిహితులు ఫోన్ చేసి ప్ర‌సంశించారు. ఇప్పుడు మా మూవీ మోష‌న్‌పోస్ట‌ర్‌ను అనిల్ రావిపూడిగారు రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. క‌చ్చితంగా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.
 
చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ,సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.
దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ -  ``ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో టీజ‌ర్ విడుద‌ల‌చేస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. స్వర్ణాంధ్రప్రదేశ్ - విజన్ 2047ను సాకారం చేయడమే లక్ష్యం

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments